దానం నాగేందర్ అనర్హత వేటుపై షాకింగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ (Danam Nagender ) శాసనసభ సభ్యత్వంపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటు వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించి, విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

కాగా, గతంలో బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ (Danam Nagender), ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు ఆయన సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన వెంటనే తాను ఫైటర్‌నని, ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమని వ్యాఖ్యానించిన దానం.. అనూహ్యంగా ఆ తర్వాతి రోజే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు దానం నాగేందర్ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం ఎదుట అత్యవసరంగా ప్రస్తావించారు. ఖైరతాబాద్ (Khairatabad) నియోజకవర్గానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే ఈ పిటిషన్ పై విచారణ జరిపి స్టే విధించాలని కోరారు. దీనిపై ప్రతివాదులైన బీఆర్ఎస్, బీజేపీ తరుఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పక్షాల వాదలను విన్న అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Also Read : సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి: మంత్రి ఉత్తమ్‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>