ఆటోగ్యాస్ కొరతను అధిగమించడానికి ప్రజా రవాణా సేవల విస్తరణ : మంత్రి ఉత్తమ్​

కలం, వెబ్​ డెస్క్​ : అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఉన్నందున ప్రత్యామ్నాయంగా ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరించెందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ కొరత ఆటోలతో సహా గ్యాస్ ఆధారిత వాహనాలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై సోమవారం మంత్రి పౌర సరఫరాల శాఖా అధికారులతో పాటు ఎల్పీజీ గ్యాస్ సరఫరా దారులతో సచివాలయంలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,హైదరాబాద్ కలెక్టర్ హారిచందన, ఐ.ఓ.సీ.ఎల్​, గోగ్యాస్, టోటల్ ఎనర్జీలతో పాటు సూపర్ గ్యాస్,ప్రమ్ గ్యాస్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలతో ఏర్పడిన కొరతను భర్తీ చేయడానికి ఐ.ఓ.సీ.ఎల్,హెచ్.పీ.సీ.ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రావాలని కోరారు. వాహనాలకు సరఫరా చేసే ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఏర్పడ్డ సంక్షోబాన్ని నివారించేందుకు సరఫరాలను పెంచాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖామంత్రి హార్డిప్ సింగ్ పూరీ కి లేఖ రాయనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. అదే సమయంలో గ్యాస్ ఆధారిత ఆటో సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితిని పారదర్శకంగా వివరించాలని అధికారులకు ఆయన సూచించారు.

గ్యాస్ ఆధారిత ఆటోలతో పాటు ఆటోలకు రోజువారీగా 202 మెట్రిక్ టన్నుల గ్యాస్ అవసరం ఉండగా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ సంక్షోభంతో రోజు వారీగా 147 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని వివరించారు. రోజూ వారి లోటు 55 మెట్రిక్ టన్నులు ఉండగా ఆ కొరత మొత్తం ప్రవైట్ రంగంలో కనిపిస్తోందని చెప్పారు. ఆటో ఎల్పీజీ సరఫరాలో ప్రైవేట్​ సంస్థలు 75 శాతం వాటాను కలిగి ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఇప్పటికీ మెరుగైన సరఫరా చేస్తున్నాయని చెప్పారు.

హైదరాబాద్ లో 116 ఔటర్ రింగ్ రోడ్డు లోపట, బయట 27 తో కలిపి మొత్తం 143 సీఎన్జీ స్టేషన్లు ఉండగా 23 ఔట్ లెట్లు పనిచేయడం లేదని, పనిచేయని వాటిలో 17 నగరం నడిబొడ్డున ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ యుద్ద వాతావరణం ఇంధన వనరుల మీద కనిపిస్తుందని, ఎల్పీజీ దిగుమతి చేసే నౌకలు రెండు నుండి మూడు రోజులు ఆలస్యంగా వస్తుండడంతో ఆటో గ్యాస్​ కొరత సంక్షోభానికి ప్రధాన కారణమని మంత్రి స్పష్టం చేశారు. ప్రైవేట్​ సంస్థలు కృష్ణపట్నం, మహారాష్ట్ర లోని జైఘడ్, ముంబై లతో పాటు తమిళనాడు రాష్ట్రాల టెర్మినల్స్ నుంచి బల్క్ ఎల్పీజీని సేకరిస్తున్నాయని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>