Mobile Popup Ad
Mobile Popup Ad

మూసీపై బీఆర్ఎస్ వైఖ‌రేంటో చెప్పాలి: మంత్రి శ్రీధ‌ర్ బాబు

క‌లం, వెబ్ డెస్క్‌: మూసీపై బీఆర్ఎస్ వైఖ‌రేంటో స్ప‌ష్టం చేయాల‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) డిమాండ్ చేశారు. అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా కేటీఆర్ (KTR) వ్యాఖ్య‌ల‌పై శ్రీధ‌ర్ బాబు మండిప‌డ్డారు. అసెంబ్లీ స‌మావేశాల‌పై హరీష్ రావు (Harish Rao) బీఏసీలో మాట్లాడిన అంశాల‌ను వారి సభ్యులకు కూడా చెప్పాల‌ని సూచించారు. ఒక ప్రశ్నపైనే సభా సమయాన్ని వృథా చేయొద్దని కోరారు. మూసీ ప్రాజెక్ట్ (Musi Project) డీపీఆర్‌ను ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిపదికన త‌యారు చేయ‌లేద‌ని శ్రీధ‌ర్ బాబు స్ప‌ష్టం చేశారు. 2024 డిసెంబర్‌లో డీపీఆర్ తయారీ కోసం మెయిన్ హార్ట్‌కు బాధ్యత అప్ప‌గంచిన‌ట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి డీపీఆర్ సిద్ధమైంద‌ని చెప్పారు.

ఇక బ‌ఫ‌ర్ జోన్ 50 మీటర్లలో ఉండాలని 2016లో బీఆర్ఎస్ జీవో ఇచ్చింద‌ని శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) గుర్తు చేశారు. ఆ జీఓనే ప్ర‌భుత్వం అమలు చేస్తున్న‌ద‌ని చెప్పారు. వచ్చే బోర్డ్ మీటింగ్‌లో ఏడీబీ అప్రూవల్ వస్తుందని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. ఆ సంస్థ ఇవ్వకపోతే మరో సంస్థ ఇస్తుంద‌ని పేర్కొన్నారు. మ్యాన్ హాట్ సంస్థ ఎన్నో పనులు చేసింద‌ని వెల్ల‌డించారు. గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ఏ పనిని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆపడం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Read Also: మూసీ డీపీఆర్‌పై వచ్చిన క్లారిటీ.. ఖర్చెంతో తేలింది..!

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>