కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేతికి గాయమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అసెంబ్లీ మార్షల్స్ కాస్త దురుసుగా ప్రవర్థించడంతో గాయమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు నిరసన చేపట్టారు. మొక్కజొన్న కంకులతో మొక్కజొన్న రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని.. మద్దతు ధర చెల్లించాలని నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ప్రజా ప్రతినిధి అని చూడకుండా చేతిలో ఉన్న మొక్కజొన్న పొత్తులను మార్షల్ లాక్కున్నారు. దీంతో హరీశ్ రావు (Harish Rao) చేతికి గాయమయ్యి, చేతి నుండి రక్తం కారింది. మార్షల్స్ తీరుపై హరీష్ రావు, మిగతా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ లోపలికి వెళ్ళే ద్వారం వద్ద ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. పోలీసులు, ప్రభుత్వ వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేసి సభ్యులు సభలోకి వెళ్లారు. సమావేశాలు ప్రారంభమైన కాసేపటిక్రితమే బీఆర్ఎస్ సభను వాకౌట్ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష పూరిత వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
Read Also: మూసీపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు
Follow Us On : WhatsApp

