లింబాద్రి గుట్టకు మంత్రి సీతక్క.. రూ.4 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క (Minister Seethakka) శుక్రవారం భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్ట (Limbadri Gutta) ను సందర్శించి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ చరిత్రను ఆలకించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకుముందు ఆలయం వద్ద రూ.4 కోట్ల నిధుల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వసతి గృహానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని గెస్ట్‌హౌస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రి సీతక్కకు పూల మొక్క అందించి ఘన స్వాగతం పలుకుగా, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధర్మకర్త ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ మంత్రికి స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, ఈరవత్రి అనిల్, సునీల్ రెడ్డి, అవినాష్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>