108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం!

కలం, మధిర: 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తి, చాకచక్యంతో మార్గమధ్యంలోనే ఓ గర్భిణికి సురక్షిత ప్రసవం జరిగింది. అంబులెన్స్‌(Ambulance)లోనే మహిళ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఎస్కే షమీనా (31) రెండో కాన్పు నిమిత్తం గురువారం రాత్రి పురిటినొప్పులతో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఆమెను 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో బోనకల్ మండలం జానకీపురం సమీపంలో ఈఎంటీ కళ్యాణి చాకచక్యంగా అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు.

షమీనా మగబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అనంతరం ఈఎంటీ కళ్యాణి, అంబులెన్స్ పైలట్ రవీంద్రబాబు వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు. ఆపద సమయంలో వెంటనే స్పందించి తల్లీబిడ్డ ప్రాణాలను కాపాడిన 108 సిబ్బందికి షమీనా కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>