epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మంత్రి సీతక్కకు నిరసన సెగ

తెలంగాణ మంత్రి సీతక్క (Minister Seethakka)కు నిరసన సెగ ఎదురైంది. తమ వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారంటూ రైతులు మంత్రిని నిలదీశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. పంట బోనస్‌ ఇవ్వాలని, సకాలంలో కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు మంత్రిని ప్రశ్నించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నదాతలపై మంత్రి అసహనం?

మంత్రి సీతక్క రైతులపై అసహనం వ్యక్తం చేసినట్టు వీడియోలో కనిపించింది. “మీరు రైతులా?” అంటూ మంత్రి దురుసుగా మాట్లాడారని రైతులు చెబుతున్నారు. ఉద్రిక్తతను నియంత్రించేందుకు పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. బందోబస్తు మధ్య మంత్రి సీతక్క(Minister Seethakka) అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైతులు మాత్రం తమ డిమాండ్లు న్యాయమైనవేనని, పంట కొనుగోళ్లలో జాప్యం కారణంగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని బాధపడ్డారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బోనస్‌ చెల్లింపులు, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో లోపాలను సరిచేయాలని కోరుతున్నారు.

బోనస్ పెండింగ్

తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది రైతులు సన్నవడ్లు సాగుచేశారు. ఒక నివేదిక ప్రకారం, సుమారు రూ. 1,161 కోట్లకు పైగా బోనస్ ఇంకా రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలో రైతులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లలోనూ ఆలస్యం జరుగుతోంది. ఇటీవల పలు జిల్లాల్లో రైతులు బోనస్ కోసం ఆందోళనలు చేపట్టారు.

Read Also: ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>