Mobile Popup Ad
Mobile Popup Ad

ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ఐబొమ్మ(ibomma) కేసులో పోలీసులు ఇమ్మడి రవిని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా రవి పోలీసులకు అనేక విషయాలు చెప్పినట్టు సమాచారం. రవి కేవలం ఐబొమ్మ మాత్రమే కాకుండా, పలు పైరసీ డొమైన్‌లను కూడా నడిపినట్టు విచారణలో బయటపడింది.

65కుపైగా మిర్రర్ సైట్లు… భారీ యూజర్ బేస్‌

పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ ప్రకారం, ఐబొమ్మ(ibomma), బప్పం టీవీ వంటి ప్లాట్‌ఫారమ్‌లు సహా 65కుపైగా మిర్రర్ వెబ్‌సైట్లను రవి నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. వీటికి ప్రతి నెల సుమారు 3.7 మిలియన్ యూజర్లు ఉన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఈ భారీ ట్రాఫిక్ కారణంగా రవికి అప్రయత్నంగా కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని సమాచారం.

ఆన్‌లైన్‌ బెట్టింగ్ ద్వారా భారీ ఆదాయం

పైరసీతో పాటు రవి(Immadi Ravi) ఆన్‌లైన్‌ బెట్టింగ్ ద్వారా కూడా రవికి భారీ ఆదాయం వచ్చేదని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అనేక పైరసీ సైట్లను పంపిణీ పాయింట్లుగా ఉపయోగించి, బెట్టింగ్‌కు సంబంధించిన లింకులు, ప్రకటనల ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసుల రిపోర్ట్‌ పేర్కొంది.

నకిలీ పత్రాలతో మోసం… క్రిప్టో మార్పిడి కూడా

రవికి “ప్రహ్లాద్ కుమార్‌” పేరిట నకిలీ పాన్ కార్డ్‌ ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ నకిలీ గుర్తింపుతోనే పలు లావాదేవీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ ద్వారా వచ్చిన డబ్బును క్రిప్టోకరెన్సీగా మార్చడానికి బినామీ ఖాతాలను ఉపయోగించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ లావాదేవీలు గుర్తించకుండా అనేక పద్ధతుల్లో ఆ డబ్బును మార్పిడి చేసినట్టు సమాచారం.

విచారణకు సహకరించని రవి

విచారణ సమయంలో రవి సహకరించకపోవడంతో, ముఖ్యమైన డేటాను రికవరీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని పోలీసులు పేర్కొన్నారు. సైబర్ ఫోరెన్సిక్ టీములకు ఇప్పటికే సూచనలు ఇచ్చినట్టు సమాచారం. ఐబొమ్మ కేసు ఇప్పటికే టాలీవుడ్‌లో పెద్ద కలకలం రేపగా, రిమాండ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పైరసీ నెట్‌వర్క్ ఎంత విస్తృతంగా పనిచేస్తుందో మరోసారి బయటపెట్టాయి.

Read Also: ఇందిరమ్మ చీరల పంపిణీ.. అర్హులు వీరే

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>