కలం, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకొని నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ఎనుగొండలోని పంచవతి విద్యాలయ (Panchavati Vidyalaya) లో ‘చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కు’ను ప్రారంభించారు. ఈ పార్కులో ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్, స్కూల్ హాస్పిటల్ జోన్, యూటర్న్ తదితర వాటిపై విద్యార్థులకు మంత్రి పొన్నం అవగాహన కల్పించారు. హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తూ.. మహబూబ్‌నగర్ డిగ్రీ కాలేజీ నుంచి పంచవతి విద్యాలయం వరకు వాహనదారులతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం పంచవతి విద్యాలయంలో హెల్త్ క్యాంప్, ఐ క్యాంప్‌ను మంత్రి పొన్నం (Minister Ponnam) ప్రారంభించారు. ‘రోడ్డు నిబంధనలు పాటిస్తాం.. ప్రమాదాలను తగ్గిస్తాం’ అని విద్యార్థులతో కలిసి ఆయన మానవహారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే కుటుంబాలు పడే ఇబ్బందులు, ఇంటి పెద్దను కోల్పోతే పిల్లలు పడే కష్టాలపై విద్యార్థులు నృత్యాల ద్వారా వివరించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తామని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తమ కర్తవ్యాలు నిర్వహిస్తామని విద్యార్థులతో రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ, మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మైనార్టీ ఫైనాన్స్ కారొపోరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ పుష్ప గుప్తా, జేటీసీ చంద్రశేఖర్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నట్లు తెలిపారు.
Read Also: సీఎం జోలికి రావొద్దు.. జీవన్ రెడ్డికి మంత్రి అడ్లూరి స్ట్రాంగ్ వార్నింగ్!
Follow Us On: Instagram

