కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై కేంద్రం సీబీఐ దర్యాప్తు చేయించాలి: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project), అలాగే విద్యుత్ కొనుగోళ్ల అవకతవకల అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ (CBI) చేత కేంద్రం దర్యాప్తు చేయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఘోష్ కమీషన్ విచారణ జరిపి అవినీతి జరిగిందని, ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని నివేదికను సీబీఐకి అప్పగించి 9 నెలలు గడిచిన చర్యలు తీసుకోలేదంటే బీజేపి-బీఆర్ఎస్ పార్టీల లాలూచి కాకపోతే ఇంకా ఏంటి? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని ఇద్దరు కేంద్ర మంత్రులకు, బీజేపి ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే, రాజకీయంగా లాభం కోసం లాలూచి పడకుండా కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై సీబీఐ చేత విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం హన్మకొండ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మంత్రి హాజరై ప్రారంభించారు.

అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి..

అనంతరం పొంగులేటి (Ponguleti) మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వమని అన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి వివరించారు. ఎన్నికల వాగ్ధానంగా నాడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ సభ నుండి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ రైతు పక్షపాతి ప్రభుత్వంగా పరిపాలనందిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు మద్దతు ధర, రూ.500 బోనస్, ఎకరాకు 12వేల రైతు భరోసా అందజేస్తున్నామని తెలిపారు. దశాబ్దాల భూ సమస్యల పరిష్కారం కోసం తెచ్చిన భూభారతి పోర్టల్ వంటి అనే అంశాల గురించి మంత్రి పేర్కొన్నారు. మే 5,6,7 తేదీలలో జరిగే ఈ రైతు మేళాలో రైతులకు యాంత్రింకంగా ఉపయోగపడే పనిముట్లను సబ్సీడీపై అందించనున్నట్లు తెలిపారు.

అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు మేళా వేదికగా భూసారా పరీక్షలు చేసిన అధికారులకు మంత్రిగారు సర్టిఫికెట్స్ ను అందజేశారు. అంతకు ముందు రైతు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పొంగులేటి సందర్శించారు.

Read Also: గొలుసు దొంగను అడ్డుకున్న ఆటోడ్రైవర్‌కు సజ్జనార్ సన్మానం

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>