కలం, ఖమ్మం బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగడంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో గతంలో కంటే విద్యార్థుల సంఖ్య తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, అధికారుల పనితీరును ప్రశ్నించారు. ప్రహారీ గోడ సహా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ రెండు నెలల్లోగా పూర్తి కావాలని, నిర్లక్ష్యం వహిస్తే కుదరదని స్పష్టం చేశారు. తాను మళ్లీ వచ్చేసరికి పనులు పూర్తి కావాలని గడువు విధించారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం పెంచేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని మంత్రి సూచించారు.
Read Also: అమానుషం.. డ్రైనేజీ పక్కన మృత శిశువు
Follow Us On: X(Twitter)


