epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ది వితండ వాదం : పొంగులేటి

తమ ప్రభుత్వం తీసుకొస్తున్న హిల్ట్ పాలసీ(HILT Policy)పై బీఆర్ఎస్ ది వితండ వాదం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti). ఇందులో ఎవరి లాభాపేక్ష లేదని తెలిపారు. హిల్ట్ పాలసీని కమర్షియల్ గా మేం మార్చలేదు. కేబినెట్ బహిరంగంగా నిర్ణయం తీసుకుంటే తప్పేముంది. గత ప్రభుత్వమే కమర్శియల్ గా మార్చింది నిజం కాదా అని ప్రశ్నించారు మంత్రి. తన కొడుకుపై వస్తున్న ఆరోపణల మీద స్పందించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎవరి మీద బాంబులు పడుతాయో త్వరలోనే అందరికీ తెలుస్తుందన్నారు. విజన్ 2047 ప్రోగ్రామ్ ను డిస్టర్బ్ చేయడానికే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిపై లక్షల్లో ఫిర్యాదులు వచ్చాయి. సింగిల్ పేజీ రెవెన్యూ వ్యవస్థను రాబోయే కొత్త ఏడాదిలో ప్రజలను అందిస్తాం. NAC యాప్, భూ భారతి యాప్ ను త్వరలోనే ప్రజలకు అందిస్తామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti). తెలంగాణలోని అన్ని గ్రామాలకు ల్యాండ్ బౌండరీలు పూర్తి అయిపోతున్నాయని.. త్వరలోనే భూ దార్ కార్డులు ఇస్తాం. రూరల్ గ్రామాలు 373 ఉన్నాయి.. వీటిని సెకండ్ ఫెజ్ లో భూ దార్ కార్డులు ఇస్తామని తెలిపారు. ‘మూడో ఫెజ్ లో ప్రతీ జిల్లాలో 70 గ్రామాలను సర్వే చేసి భూ దార్ ఇస్తాం. రాష్ట్రంలో ప్రతీ మండలానికి సర్వేయర్లను నియమించాం. సర్వే చేయానికి కొత్త టెక్నాలజీ వ్యవస్థ రోలర్స్ ను కొనుగోలు చేశాం’ అని వివరించారు మంత్రి.

Read Also: ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్ మెంట్..?

Follow Us on: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>