Mobile Popup Ad
Mobile Popup Ad

పాఠశాలలో అశ్లీల నృత్యాలపై మంత్రి లోకేశ్ ఆగ్ర‌హం

క‌లం, వెబ్ డెస్క్‌: పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని ఓ బాలుర‌ ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో హిజ్రాల‌తో అశ్లీల నృత్యాలు చేయించిన ఘ‌ట‌న‌పై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి విచార‌ణ‌కు ఆదేశించారు. జిల్లాలోని కురుపాం మండ‌లం నీల‌కంఠ‌పురంలోని ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో ఇటీవ‌ల ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఫేర్‌వెల్ పార్టీ జ‌రిగింది. ఈ పార్టీలో స్వ‌యంగా ఉపాధ్యాయులే హిజ్రాల‌ను ర‌ప్పించి అశ్లీల నృత్యాలు చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఉపాధ్యాయుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ను ఐటీడీఏ అధికారులు స‌స్పెండ్ చేశారు. ఐటీడీఏ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఐటీడీఏ డీడీ విజయశాంతి పాఠ‌శాల‌కు వెళ్లి విచార‌ణ చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఓ ఉపాధ్యాయుడిని కూడా సస్పెండ్ చేసిన‌ట్లు స‌మాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>