Mobile Popup Ad
Mobile Popup Ad

పునర్వికకు రూ.6 కోట్లు సాయం చేస్తా : మంత్రి లోకేష్‌

కలం, డెస్క్ : కర్నూలుకు చెందిన పునర్విక అనే బాలిక ఎస్ఎంఏ టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు అవసరం అయ్యే రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. అనేక మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఆ బాలికను కాపాడటం కోసం వీడియోలు పెడుతూ.. ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ (Lokesh) తమను ఆదుకోవాలంటూ పాప పేరెంట్స్ ఎక్స్ లో రిక్వెస్ట్ చేశారు.

వారి విజ్ఞప్తిపై మంత్రి లోకేష్ (Lokesh) స్పందించారు. ‘పునర్వికకు అరుదైన వ్యాధి సోకడం బాధాకరం. అయినా సరే బాలిక పోరాటం అభినందనీయంగా ఉంది. ఆమె కోసం ఇప్పటికే రూ.10 కోట్లు సేకరించడం చాలా గొప్ప విషయం. మిగతా రూ.6 కోట్లు సమకూర్చే బాధ్యత నాదే. దీని కోసం అందరూ సహకరించాలి’ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు లోకేష్. ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అనేక మంది లోకేష్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>