కలం, సినిమా : యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) గత ఏడాది ‘తండేేల్’ (Thandel) సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమా నాగచైతన్యకు సాలిడ్ హిట్ అందించింది. ప్రస్తుతం నాగచైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరక్షన్‌లో ‘వృషకర్మ'(Vrushakarma) అనే మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన క్యూట్ బ్యూటీ మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తుండగా.. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాధ్(Ajaneesh Loknath) మ్యూజిక్ అందిస్తున్నాడు.
విరూపాక్ష సూపర్ హిట్ కావడంతో ‘వృషకర్మ’(Vrushakarma) సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మార్చి 5, 2026న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మైథాలజీ నేపథ్యంతో మంచి-చెడుల మధ్య సాగే ఈ కథ హీరో కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

