Mobile Popup Ad
Mobile Popup Ad

వైద్యులు సేవా భావంతో విధులు నిర్వర్తించాలి: కొండా సురేఖ

కలం, వరంగల్ బ్యూరో: వైద్యులు సేవా భావంతో విధులు నిర్వర్తించాలని, ముఖ్యంగా సమయ పాలన పాటించాలని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సూచించారు. బుధవారం వరంగల్ (Warangal) ఎంజీఎం ఆసుపత్రి (MGM Hospital) అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి పనులు, వైద్య సేవల నాణ్యత, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల మెరుగుదలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే వారందరూ పేదలేనని తెలిపారు. పేద ప్రజలకు కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించాలని అన్నారు.

ఆసుపత్రి అభివృద్ధి పనులు, వైద్య సేవల నాణ్యత, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆరోగ్య శ్రీ నిధులతో ఎంజీఎంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వైద్యం కోసం వచ్చే రోగులకు డాక్టర్లు జవాబుదారీ తనంగా వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్, కమిటీ చైర్ పర్సన్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కమిటీ మెంబర్, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిచంద్రారెడ్డి (కమిటీ కన్వీనర్), ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>