‘డేవిడ్ రెడ్డి’ సినిమా టైటిల్ తొలగించాలి: కిరణ్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: “డేవిడ్ రెడ్డి” పేరుతో పెట్టిన సినిమా టైటిల్ ను తొలగించాలని హైందవ రెడ్డి సేన (Hyndava Reddy Sena) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రావుల కిరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. రెడ్డి సమాజాన్ని కించపరిచే, మతపరమైన ప్రచారం చేసే విధంగా రూపొందుతున్న “డేవిడ్ రెడ్డి” అనే సినిమా టైటిల్‌ను తక్షణం తొలగించకపోతే హైందవ రెడ్డి సేన ఆధ్వర్యంలో ఈ సినిమాని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సినిమా టైటిల్ ద్వారా రెడ్డి సమాజం క్రైస్తవ మతంలోకి మారిందని మండిపడ్డారు.

స్వాతంత్య్ర పూర్వకాలంలో రెడ్ల నుంచి మతం మారిన వారిని స్వాతంత్య్ర సమరయోధులుగా చిత్రీకరించి, ఒక కల్పిత పాత్రను సృష్టించి క్రైస్తవ మత వ్యాప్తిని ప్రోత్సహించడానికి ఈ చిత్రాన్ని ఓ అస్త్రంగా, ఒక పనిముట్టుగా ఉపయోగించాలనే ఉద్దేశం ఉన్నట్టు స్పష్టమవుతుందని అన్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల రెడ్డి సమాజం యొక్క గౌరవం, సాంస్కృతిక వారసత్వం బలంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. రెడ్డి సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని, హిందూ సంస్కృతిని ఎలాంటి బాహ్య శక్తుల నుంచైనా కాపాడటానికి హైందవ రెడ్డి సేన కట్టుబడి ఉందన్నారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి, సినిమా టైటిల్‌ను తొలగించి, రెడ్డి సమాజం భావనలను గౌరవించాలని హైందవ రెడ్డి సేన డిమాండ్ చేస్తుందని తెలిపారు.

Read Also: మ్యాంగో జ్యూస్ తాగుతున్నారా?.. అయితే జాగ్రత్త!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>