నారాయణపేటలో జన జాగరణ యాత్ర

కలం, నారాయణపేట: కొత్త పింఛన్ విధానం వలన ఉద్యోగులకు ఎలాంటి లాభం లేదని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు. నారాయణపేట (Narayanpet) జిల్లా కేంద్రంలో ఆదివారం యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం జన జాగరణ యాత్ర (Jana Jagarana Yatra) నిర్వహించారు. ముందుగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు..

అనంతరం పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో గంగాపురం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం నూతన పెన్షన్ విధానం వల్ల పెద్దగా బెనిఫిట్స్ ఏమి లేవన్నారు. దీంతో ఉద్యోగులకు భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. 30 ఏళ్లు సమాజానికి సేవ చేసిన ఉపాధ్యాయుడికి వృద్ధాప్యంలో కేవలం రూ.3 వేల పెన్షన్ వస్తుందని, ఇది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

పాత పింఛన్ పునరుద్ధరించాలి..

ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఆగస్టు 23న నిర్వహించే చలో హైదరాబాద్ మహాసభకు ప్రతి సీపీఎస్ ఉద్యోగి భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. యూనియన్ రాష్ట్ర కోశాధికారి నరేష్, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, నారాయణపేట (Narayanpet) జిల్లా అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రాచారి, ఎం.నరసింహారెడ్డి, ఎం.జనార్దన్ రెడ్డి, షేర్ కృష్ణారెడ్డి, దామోదర్, నరసింహ పాల్గొన్నారు.

Read Also: పాలమూరు ప్రాజెక్టుల సాధనకు కృషి చేస్తాం: ఎంపీ మల్లు రవి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>