Mobile Popup Ad
Mobile Popup Ad

క‌ర్ణాట‌క‌ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ డీకే

క‌లం, వెబ్ డెస్క్‌: క‌ర్ణాట‌క (Karnataka) రాజ‌కీయాల్లో స‌రికొత్త అధ్యాయం ప్రారంభ‌మైంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డీకే శివ కుమార్ (DK Shivakumar) బుధవారం రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. బెంగ‌ళూరులోని లోక్ భ‌వ‌న్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, కాంగ్రెస్ అగ్ర నేత‌లు రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్‌, తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి అజారుద్దీన్‌, కేర‌ళ సీఎం వీడీ స‌తీష‌న్‌, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్ ధావ‌ర్ చంద్ గ‌హ్లోత్ డీకే చేత ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అలాగే డిప్యూటీ సీఎంగా జి.ప‌ర‌మేశ్వ‌ర ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇటీవ‌ల సిద్ధ రామ‌య్య పార్టీ అధిష్టానం సూచ‌న మేర‌కు సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం డీకే శివ‌కుమార్‌ను క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా నిర్ణ‌యించారు. సిద్ధ రామ‌య్య‌ను సీడ‌బ్ల్యూసీ మెంబ‌ర్‌గా ప్ర‌క‌టించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>