కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి అమృత వనం ఎకో ఫారెస్ట్ పార్క్‌తో పాటు మంబాపూర్ హరితవనం పార్కును రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ప్రారంభించారు.
అనంతరం మంత్రి సురేఖ (Konda Surekha) మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో ఉన్న అటవీ అర్బన్ పార్కులను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి హరితవనాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అర్బన్ పార్కులను ప్రజలకు మరింత చేరువ చేస్తూ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని, పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: ప్యాకేజ్డ్ బేబీ స్కామ్
Read Also: ఉదయనిధి విమర్శలకు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

