Mobile Popup Ad
Mobile Popup Ad

మెడిసిన్ విద్యార్థులు మానవత్వంతో వైద్యం అందించాలి: మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: మెడికల్ కళాశాల విద్యార్థులు మానవత్వంతో వైద్యం అందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) సూచించారు. గురువారం నల్లగొండలోని మెడికల్ కళాశాల (Nalgonda Medical College) వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో మొత్తం 35 మెడికల్ కళాశాలలో ఉంటే, అందులో బెస్ట్ కళాశాలగా నల్గొండ మెడికల్ కళాశాలను అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తాను మంత్రి అయినప్పుడు మెడికల్ కళాశాల స్లాబ్ లెవెల్ వరకు ఆగిపోతే.. వెంటనే రూ.85 కోట్లు కేటాయించి పూర్తి చేయించానని కోమటిరెడ్డి గుర్తుచేశారు.

మెడికల్ కళాశాల (Medical College)లో మొత్తం 350 మంది విద్యార్థులు ఉండగా, కళాశాలకు ఆటోలో వచ్చి పోతూ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెండు బస్సులు తీసుకొని నెలలోనే ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. కళాశాల చదివే వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఏ సమస్య ఉన్న తన దృష్టికి లేదా మేయర్ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మోడల్ సిటీగా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) స్పష్టం చేశారు.

Read Also : భర్త సీఎం.. భార్య ఎమ్మెల్యే.. అసెంబ్లీలో ప్రశ్నలు..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>