కలం, వెబ్ డెస్క్: వివాదాస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ 2’ (The Kerala Story 2) నిర్మాతలకు షాక్. ఈ మూవీ విడుదలకు కేరళ హైకోర్టు (Kerala High Court) బ్రేక్ వేసింది. ఈ చిత్రం రిలీజ్‌పై రెండు వారాల తాత్కాలిక స్టే విధించింది. దీంతో రేపు విడుదల కావాల్సిన ఈ సినిమా నిలిచిపోయింది.
బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా రెండేళ్ల కిందట రిలీజై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొదట్లో ఆ సినిమాపైనా వివాదాలు రాగా, తర్వాత సద్దుమణిగాయి. ఈ క్రమంలో మొదటి భాగానికి కొనసాగింపుగా ‘ది కేరళ స్టోరీ 2’ తెరకెక్కింది. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్ షా నిర్మాణ సారథ్యంలో, డైరెక్టర్ కామాఖ్య నారాయణ సింగ్ ఈ మూవీని తీశారు. అయితే, ఈ సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచే వివాదాలు తలెత్తాయి.
ఇందులోని డైలాగులు, సన్నివేశాలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా, కేరళను అవమానించేలా ఉన్నాయని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇలాంటి సినిమాకు సెన్సార్‌బోర్డు ఇచ్చిన యు/ఎ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కేరళ అత్యున్నత న్యాయస్థానం విచారణకు తీసుకుంది. ఈ చిత్రాన్ని (The Kerala Story 2) తాము చూసిన తర్వాతే ఏ విషయమూ చెబుతామని గత విచారణలో న్యాయస్థానం. ఈ క్రమంలో బుధవారం సినిమా చూసిన అనంతరం గురువారం న్యాయస్థానం మరో దఫా విచారించింది. సినిమా రిలీజ్‌కు బ్రేక్ వేసింది.
విచారణ సందర్భంగా సెన్సార్బోర్డ్పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిగా పరిశీలించకుండానే సినిమాకు అనుమతి ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. పిటిషనుదారు లేవనెత్తిన అభ్యంతరాలను సెన్సార్‌బోర్డు పరిశీలించాల్సి ఉందని చెప్పింది.
Read Also : రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సెకండ్ సింగిల్ బిగ్ అప్డేట్
Follow Us On: Instagram

