తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కంటే నా పాత్రే ఎక్కువ: కోమటిరెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కంటే నా పాత్రే ఎక్కువ అని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy)  తెలిపారు. మంగళవారం ఉదయం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో మేమిద్దరం రోజు మాట్లాడుకునేవాళ్ళమని, తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన సమయంలో పార్టీలు వేరైనా ‘నువ్వు గ్రేట్ వెంకన్న’ అంటూ కితాబు ఇచ్చారని గుర్తుచేశారు. మా ఫ్యామిలీ కేసీఆర్‌కు చాలా దగ్గర పరిచయం.. పరిచయం వేరు, పార్టీలు వేరు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఉన్నప్పటికీ ఆయనకంటే పెద్ద పాత్రను నేనే పోషించానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

కేసీఆర్ (KCR) రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని, నేను మాత్రం రాజీనామా చేసి, సోనియాగాంధీ మంత్రి పదవి తీసుకోమని చెప్పినా. తెలంగాణ వచ్చిన తర్వాతనే తీసుకుంటానని చెప్పానని గుర్తుచేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ నా బర్త్ డే‌కు సైతం ప్రతిసారి విషెస్ చెప్పేవారని, అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా గ్రీటింగ్స్ మాత్రం పంపించేదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>