కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) ఉదయం మూడు గంటలకే రోడ్డు ఎక్కారు. తెల్లవారుజామున క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ (Nalgonda Corporation) పరిధిలోని ప్రకాశం బజార్ ప్రాంతాన్ని సందర్శించారు. ఇప్పటికే ఇచ్చిన హామీ ప్రకారం నల్లగొండ నగరాన్ని పరిశుభ్రంగా, రహదారులను విస్తీర్ణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు. నగర పారిశుధ్యం, ఇరుకు రహదారుల విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం జేసీబీల సహాయంతో రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రకాశం బజార్లో రోడ్లపై ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న అడ్డంకులను తొలగిస్తూ నగర అభివృద్ధికి వేగం తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రకాశం బజార్ లోని ఆక్రమణాలను దగ్గరనుండి తొలగించారు. నల్లగొండను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండను “సూపర్ స్మార్ట్ సిటీ” గా అభివృద్ధి చేస్తానని ఇప్పటికే పలు మార్లు మంత్రి ప్రకటించారు. అందులో భాగంగానే మొదటి మేయర్ ఎన్నిక పూర్తి కాగానే.. రోడ్డు వెడల్పు, ఆక్రమణల తొలగింపు పనులపై తానే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రకాశం బజార్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా డివైడర్ల తొలగింపు చేపట్టారు. ప్రకాశం బజార్లో ఉన్న పూలు , పండ్ల దుకాణాలను పాత కలెక్టరేట్ ఆఫీస్ స్థలంలో ఏర్పాటు చేసేందుకు అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం సాయంత్రంలోగా పాత కలెక్టరేట్ కార్యాలయ స్థలంలో సీసీ రోడ్లు వేసి తక్షణమే పూలు, పండ్ల దుకాణదారులకు స్థలాలు కేటాయించాలని, ఇకపై ప్రకాశం బజార్లో రద్దీ ఉండకూడదని సూచించారు. పూలు, పండ్ల వ్యాపారులందరూ సహకరించాలని, ఉపాధి కోల్పోకుండా అందరికీ అక్కడ స్థలం చూయిస్తామని తెలిపారు. ప్రకాశం బజార్ రోడ్డులో ఇకపై ఇబ్బందులు లేకుండా భూగర్భ ఎలక్ట్రిసిటీతోపాటు, తక్షణమే సీసీ రోడ్డు వేయాలని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) ఆదేశించారు.
Read Also: గ్లోబల్ వ్యాక్సిన్ తయారీ సెంటర్ గా హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat


