లిక్క‌ర్ వినియోగం ఒక్క శాతం కూడా పెర‌గ‌లేదు: మంత్రి జూప‌ల్లి

క‌లం, వెబ్ డెస్క్‌: కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక్క శాతం కూడా లిక్క‌ర్ వినియోగం (Liquor Consumption) పెర‌గ‌లేద‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishnarao) వెల్ల‌డించారు. బీజేపీ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ జూప‌ల్లి కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు. 2014లో సుమారు రూ.10 వేలు ఉన్న ఎక్సైజ్ శాఖ ఆదాయం 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.34 వేల కోట్లకు వచ్చింద‌న్నారు. ఈ ప‌దేళ్ల‌లో 22 శాతం ఆదాయం పెరిగింద‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ఎక్సైజ్ ఆదాయం సుమారు రూ.37 వేల కోట్ల నుంచి రూ.38 వేల కోట్లుగా ఉంద‌న్నారు. మ‌ద్యానికి సంబంధించి టెండర్ల ద్వారా ఆదాయం పెరిగింది తప్ప, అమ్మ‌కాల ద్వారా పెర‌గ‌లేద‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వంతో పోల్చితే ప‌ది శాతం కూడా పెర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Read Also: భారతదేశంలో ఎవరి మతం వాళ్లకు ఉంటుంది: వాకిటి శ్రీహరి

Follow Us On: Instagram

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>