కలం, వెడ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. బడ్జెట్ పై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ అంశం మంగళవారం శాసనసభను కుదిపేసింది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి , మంత్రి శ్రీధర్‌బాబు (Maheshwar Reddy Vs Sridhar Babu) మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది మోసపూరిత, చీటింగ్ బడ్జెట్ అంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. దీంతో సభలో తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు మండిపడ్డారు.
తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) చీటింగ్ బడ్జెట్ అనడంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ పై అనుచిత వ్యాఖ్యలు తగదని సూచించారు. మహేశ్వర్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో కాసేపు బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కల్పించుకుని.. చీటింగ్ బడ్జెట్ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పారు.
Read Also: కాంగ్రెస్ జెండా పీకేసిన జీవన్ రెడ్డి!
Follow Us On: Instagram

