సామాన్యుడిలా మెట్రోలో ప్రయాణించిన మంత్రి జూపల్లి

కలం, వెబ్ డెస్క్: పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) హైదరాబాద్‌లో సామాన్య ప్రయాణికుడిలా మెట్రో (Metro) రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రోటోకాల్స్‌కు భిన్నంగా ఆయన సాదాసీదాగా మెట్రో ఎక్కారు. నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం ఆయన ఎర్రమంజిల్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో వెళ్లారు. స్టేషన్‌కు చేరుకున్న జూపల్లి స్వయంగా టికెట్ తీసుకుని ప్లాట్‌ఫాంపైకి వెళ్లారు. మెట్రోలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో మంత్రి సీటు కోసం ప్రయత్నించకుండా తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే ప్రయాణించారు.

ఈ క్రమంలో తోటి ప్రయాణికుల‌తో ముచ్చటించారు. మెట్రో ప్రయాణంలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రిని (Jupally Krishna Rao) తమ మధ్య చూసిన ప్రయాణికులు తొలుత ఆశ్చర్యపోయారు. ఆయన పలకరింపుతో ఉత్సాహంగా మాట్లాడారు. సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా ఓపికగా వారితో ఫొటోలు దిగారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి మెట్రో ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి అభిప్రాయపడ్డారు.

Read Also: కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్ట్ తీర్పు వాయిదా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>