ఆకస్మిక తనిఖీ.. టాయ్‌లెట్స్ కడిగిన మంత్రి జూపల్లి

కలం, వెబ్ డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి (Pentlavelli) రెవెన్యూ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ అక్కడ దరఖాస్తులు, ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని గ్రహించి, అందుకు గల కారాణాలపై ఆర్డీవో, సంబంధిత అధికారులను ఆరా తీశారు. అదే సమయంలో కార్యాలయంలోని టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా స్వయంగా మంత్రి జూపల్లి నీళ్లు పోసి టాయిలెట్లను శుభ్రం చేశారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంతటి నిర్లక్ష్యం మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు కాగా, ప్రభుత్వ కార్యాలయంలోని టాయిలెట్లను స్వయంగా జూపల్లి (Minister Jupally) శుభ్రం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నత హోదాలో ఉన్న జూపల్లి టాయ్ లెట్స్ శుభ్రం చేయడంతో అక్కడి సిబ్బంది విస్తుపోయారు.

Also Read : రాయదుర్గం భూములకు రికార్డ్ ధర.. ఎకరం రూ.264 కోట్లు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>