బాణం గుర్తుపై ఓటేయండి.. TWUను గెలిపించండి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కలం, ఉట్నూర్: ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ (MLA Bojju Patel) అన్నారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఉట్నూర్ ఆర్టీసీ డిపో (Utnoor RTC Depot) ను ఆయన సందర్శించారు. డిపోలోని కార్మికులతో సమావేశమై ఎన్నికలపై చర్చించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్టీసీ టీయూడబ్ల్యూ సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తోందని తెలిపారు. కార్మికుల సమస్యలు, సంక్షేమం, సంస్థ భవిష్యత్‌ అభివృద్ధి కోసం టీయూడబ్ల్యూకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో బాణం గుర్తుపై ఓటు వేసి టీయూడబ్ల్యూను గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ టీయూడబ్ల్యూ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>