ప్రముఖ దినపత్రికకు కేటీఆర్ లీగల్ నోటీసులు

కలం, వెబ్ డెస్క్ : ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వకుండానే తన పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈనాడు దినపత్రిక తప్పుడు వార్తలు ప్రచురించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులు పాస్‌పోర్ట్ రక్షణ కొరకు కేవలం ఒక అర్జీని మాత్రమే దాఖలు చేయగా, కోర్టు ఆదేశాలిచ్చినట్లు అసత్యపు కథనాలు రాయడంపై ఆయన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు.

తమపై అసత్య ప్రచారం చేసినందుకు గాను సదరు యాజమాన్యం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆన్‌లైన్ వేదికల నుండి ఆ వార్తకు సంబంధించిన అన్ని రకాల డిజిటల్ కథనాలను, లింకులను వెంటనే తొలగించాలని నోటీసులో స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>