కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(Nirmal Hospital)లో ఏడాది కాలంగా నిలిచిపోయిన సీటీ స్కాన్ సేవలు ఎట్టకేలకు తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సయ్యద్ హైదర్ తెలిపారు. సీటీ స్కాన్ సేవలు నిలిచిపోవవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.
హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం మరమ్మతులు పూర్తి చేసి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారని సయ్యద్ హైదర్ తెలిపారు. అత్యవసర వైద్య పరీక్షల పరికరాలు నిరంతరం పనిచేసేలా ఆసుపత్రి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, నాయకులు షేక్ షారూఖ్, అబ్దుల్ సాజిద్ పాల్గొన్నారు.
Also Read : రాయదుర్గం భూములకు రికార్డ్ ధర.. ఎకరం రూ.264 కోట్లు
Follow Us On: Sharechat

