ఓట్ల అంశంపై విపక్షాల సమరం.. ఈసీ ఆఫీస్ దగ్గర హై టెన్షన్!

కలం, వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ‘ఇండియా’ కూటమికి ( INDIA Bloc) చెందిన విపక్ష ఎంపీలు న్యూఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్‌లోని మకర్ ద్వార్ వద్ద సమావేశమైన ఎంపీలు అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) కార్యాలయం వైపు మార్చ్‌గా బయలుదేరారు. చేతుల్లో “ఓట్ బచావో… దేశ్ బచావో” అనే ప్లకార్డులు పట్టుకుని, ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను కాపాడాలని, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈసీ కార్యాలయానికి విపక్షాలు మార్చ్ నిర్వహిస్తుండటంతో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై భద్రతను భారీగా పెంచారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, విపక్ష ఎంపీల ర్యాలీని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. తమ శాంతియుత నిరసనను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, అక్కడే రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పలువురు సీనియర్ ఎంపీలు రోడ్డుపైనే కుర్చొని నిరసన కొనసాగిస్తుండడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>