Mobile Popup Ad
Mobile Popup Ad

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వరావు పేట (Aswaraopeta)లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి కాకినాడకు బియ్యం తరలిస్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ రెండు ముక్కలు కాగా.. ట్రాక్టర్‌లో ఉన్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్ గద్దల వెంకట్రావ్‌కు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతులు కొవ్వాసి నాగరాజు(41), చిట్టు చుక్కయ్య(52) అశ్వరావుపేట కెమిలాడిస్ ఫ్యాక్టరీ నుంచి బస్తాలను ట్రాక్టర్‌లో తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారైనట్లు స్థానికులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న అశ్వరావు పేట (Aswaraopeta) సీఐ నాగరాజు, ఎస్ఐ యయాతి వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Read Also: తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు.. కేటీఆర్ ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>