ట్రాన్స్ జెండర్ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి డోలా

కలం, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి ( Minister Dola Sri BV Swamy) అధ్యక్షతన ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్ జెండర్స్ సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని తెలిపారు. ట్రాన్స్ జెండర్స్ రక్షణ కోసం సిఐడి కేంద్ర కార్యాలయంలో స్వాభి మాన్ పేరుతో ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్, హెల్ప్ లైన్ (1091) ఏర్పాటు చేశామని వివరించారు. ట్రాన్స్ జెండర్లకి గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని మంత్రి వివరించారు. మనమిత్ర వాట్సప్ యాప్, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ట్రాన్స్ జెండర్స్ ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>