ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులను తీర్చిదిద్దాలి: ఆర్చరీ కోచ్ శంకరయ్య

క‌లం, వెబ్‌డెస్క్‌: భారతదేశం 2036 ఒలింపిక్స్‌ (Olympics)కు ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్న తరుణంలో, కేవలం స్టేడియాలు, క్రీడా విశ్వవిద్యాలయాల నిర్మాణం మాత్రమే పతకాలను తెచ్చిపెట్టలేవని ప్రముఖ ఆర్బరీ కోచ్ అడ్మినిస్ట్రేటర్ శంకరయ్య (Archery Coach Shankaraiah) స్పష్టం చేశారు. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో సరైన అవకాశాలు, కోచింగ్ అందక ఎంతో మంది ప్రతిభావంతులు వెనుకబడిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, 2026 నుండి 2036 వరకు ఉన్న పదేళ్ల కాలాన్ని ఒక ప్రత్యేక ‘జాతీయ క్రీడా మిషన్’గా ప్రకటించి, చిన్న వయసు నుంచే పిల్లలకు శాస్త్రీయ శిక్షణ, క్రమశిక్షణ మానసిక దృఢత్వాన్ని పెంపొందించాలని ఆయన సూచించారు.

ఇటీవల తమ అసోసియేషన్ సాధించిన SAI (NSRS) రిజిస్ట్రేషన్ జాతీయ స్థాయి గుర్తింపుల ద్వారా బాధ్యత మరింత పెరిగిందని శంకరయ్య తెలిపారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PETs) దేశ క్రీడా భవిష్యత్తుకు అసలైన మూలస్తంభాలని, వారే మొదటిసారి ప్రతిభను గుర్తిస్తారని ఆయన గుర్తు చేశారు. అయితే, చాలా స్కూళ్లలో పీఈటీల నియామకం లేకపోవడం పీఈ కాలేజీల్లో ఆధునీకరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. కేవలం పోటీలు నిర్వహించడమే కాకుండా, ప్రతి మండలం గ్రామంలో క్రీడా సంస్కృతిని విద్యలో అంతర్భాగం చేయాలని, తద్వారా గ్రామీణ క్రీడాకారులకు సరైన మద్దతు అందిస్తే ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించడం సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>