Mobile Popup Ad
Mobile Popup Ad

జోగిపేట ఆసుప‌త్రి బాగుపడదా? : మంత్రి దామోద‌ర

క‌లం, మెద‌క్ బ్యూరో : రాష్ట్ర‌ వైద్య అరోగ్య శాఖ‌ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) త‌న సొంత నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట (Jogipet) ప్ర‌భుత్వ‌ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ త‌నిఖీల్లో భాగంగా వివిధ వార్డుల‌ను ప‌రిశీలిస్తూ.. ఆసుప‌త్రిలో వైద్య సేవ‌లపై సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతి రోజు ఎన్ని రకాల టెస్టులు చేస్తున్నారు?.. ఎంతమంది చేయించుకుంటున్నారు.. మందుల కొరత ఉందా? అని అడిగి తెలుసుకున్నారు.

అయితే, 13 మంది వైద్యులు డ్యూటీకి రాలేదని తెలిసి వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ కు మంత్రి ఫోన్ చేశారు. జోగిపేట ఆసుపత్రి బాగుపడదా? వైద్యుల్లో మార్పు రాదా.. అంటూ విధులకు హాజరు కానీ డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. డ్యూటీ కి గైరాజరైన వైద్యులందరిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడి సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. ప్ర‌భుత్వ అసుప‌త్రులో వైద్యం సేవలను నిర్ల‌క్ష్యం చేస్తే స‌హించేదిలేద‌ని మంత్రి (Damodar Rajanarsimha ) హెచ్చరించారు.

Read Also: నేను ఆశాజీవిని.. పరమశివుడు ఇస్తే ఆ పదవి తీసుకుంటా : మల్లారెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>