Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండలో రేపు పాన్​ షాప్​లు బంద్​

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) పట్టణంలో పాన్ షాపులు మంగళవారం బంద్ కానున్నాయి. కేంద్ర సర్కారు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం సెస్ విధించిన నేపథ్యంలో జిల్లాలోని పాన్ షాప్ వ్యాపార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నిర్ణయానికి నిరసనగా మంగళవారం నల్లగొండ పట్టణంలోని పాన్ దుకాణాలకు పూర్తిగా బంద్ చేయనున్నట్టు నల్లగొండ పాన్ మేకర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆకస్మికంగా భారీ సెస్ విధించడం వల్ల చిన్న పాన్ దుకాణదారులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అమ్మకాలు తగ్గిపోయాయని, ఇప్పుడు 40 శాతం అదనపు భారం పడితే వ్యాపారం కొనసాగించడం కష్టమవుతుందని పాన్ షాప్​ యజమానులు అంటున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని పాన్ షాపులు బంద్‌లో పాల్గొననున్నట్లు స్పష్టం చేశారు.

Read Also: హాట్ టాపిక్: కుర్చీకోసం కుమ్మక్కు రాజకీయాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>