Mobile Popup Ad
Mobile Popup Ad

మేఘా కంపెనీలోకి జేడీ లక్ష్మీనారాయణ.. జనసేన ప్రశ్నలు..

కలం, డెస్క్ : మాజీ ఐపీఎస్ అధికారి వి.వి లక్ష్మీనారాయణ (Lakshminarayana) అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు స్పెషల్ కేసుల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి జనసేనలో చేరారు. 2019లో విశాఖ ఎంపీ స్థానంలో పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లో నటించడంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించినా పట్టు సాధించలేక శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.

తాజాగా ఆయన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కార్యకలాపాల విభాగంలో ఉపాధ్యక్షుడిగా జాయిన్ అయ్యారు. దీంతో ఆయన పూర్తిగా కార్పొరేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్టు అయిపోయింది. దీనిపై అటు జనసేన (Janasena) కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ సినిమాల్లో నటిస్తేనే.. వద్దు అని చెప్పారు కదా.. మరి ఇప్పుడు మీరెలా ప్రజా జీవితం నుంచి కార్పొరేట్ రంగంలోకి వెళ్లిపోయారంటూ లక్ష్మీనారాయణపై (Lakshminarayana) ట్వీట్లు పెడుతున్నారు.

పవన్ కల్యాన్‌ రాజకీయాల్లో పార్టీ నడపడం కోసమే సినిమాలు చేస్తే చాలా రకాల మాటలు అన్న మీరు.. ఇప్పుడు స్వలాభం కోసం మేఘా కంపెనీలో జాయిన్ అయ్యారు కదా అంటున్నారు జనసైనికులు. ఇప్పుడు మీరు కార్పొరేట్ లోకి వెళ్లడంపై ఎలా స్పందిస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా ఉన్న మేఘా కంపెనీలోకి ఎందుకు వెళ్లారంటూ ఇంకొందరు పవన్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. మొత్తంగా జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగంలో చేరితే సోషల్ మీడియాలో వివాదం అవుతోంది.

Read Also: ఢిల్లీలో లోకేష్‌ పర్యటన.. చార్లీ ఫాక్స్‌ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్ ప్రారంభం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>