దొడ్డి కొమురయ్య నేటి తరాలకు స్ఫూర్తిదాయకం : మంత్రి రాజనర్సింహ

కలం, మెదక్ బ్యూరో : సామాజిక న్యాయం, సమానత్వం కోసం దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Raja Narasimha) పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా శుక్రవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పోతిరెడ్డిపల్లిలోని దొడ్డి కొమురయ్య విగ్రహానికి మంత్రి, కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని, రైతుల హక్కుల కోసం, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన ధైర్యసాహసాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. దొడ్డి కొమురయ్య వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేయడం ద్వారానే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Raja Narasimha) వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శాసనసభ్యులు చింతా ప్రభాకర్, సంగారెడ్డి, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లు కూన వనిత, సుమలత శ్రీకాంత్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: హెల్తీ తిరామిసు: స్పెషల్ వీగన్ డెజర్ట్ రెసిపీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>