Mobile Popup Ad
Mobile Popup Ad

ఒక మహా పండుగలా మహానాడు నిలిచిపోయేలా ప్రణాళికలు: మంత్రి అనిత

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని నెల్లూరులో తొలిసారిగా జరుగుతున్న మహానాడు (Mahanadu)ను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత (Minister Anitha) స్పష్టం చేశారు. మహానాడుకు వచ్చే లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న మహానాడు–2026 సన్నాహక సమావేశంలో సహచర మంత్రులతో కలిసి అనిత పాల్గొన్నారు. మహానాడు కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులతో పాటు మీడియా కమిటీ కన్వీనర్‌గా మీడియా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.మహానాడు నిర్వహణ, మీడియా కవరేజ్, సమన్వయంపై పలు కీలక అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసే మీడియా మిత్రులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ మహానాడు ఒక మహా పండుగలా నిలిచిపోయేలా పకడ్బందీ ప్రణాళికలు రచించామని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడు సభలకు వచ్చే వారందరికీ పటిష్టమైన భోజన వసతులు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మహానాడులో ప్రతినిధులు, కార్యకర్తల కోసం సుమారు 50 రకాల వంటకాలను వండించేందుకు ప్లాన్ చేస్తున్నామని వివరించారు. మహానాడు–2026 విజయవంతం కావాలంటే ప్రతి కమిటీ సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>