కలం వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో (Six Guarantees) నాలుగు గ్యారంటీలు అమలు చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman) తెలిపారు. గురువారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మపురి (Dharampuri) నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి శాసనసభకు పంపించారన్నారు. రాబోయే రోజుల్లో యావత్ తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు తనపై ఉండాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు అమలు చేశామని, మరో రెండు గ్యారెంటీలు అమలు చేసేలా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు.
Read Also: బోర్డ్‌కి బాయ్‌కాట్ వార్నింగ్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్లేయర్స్
Follow Us On: Pinterest


