కలం, కరీంనగర్ బ్యూరో: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు మెరుగైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) అన్నారు. మంగళవారం బుగ్గారం మండలం యశ్వంతరావుపేట గ్రామంలో (Yeshwanthraopet Village) ఉపాధి హామీ నిధులు రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని(New Anganwadi Centre) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తోందని తెలిపారు.
గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. అంగన్‌వాడీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం యశ్వంతరావుపేట గ్రామానికి చెందిన షేక్ సమీర్ వివాహం సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆయన నివాసానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉరుమట్ల లక్ష్మీ బుచ్చయ్య, మాజీ ZPTC బాధినేని రాజేందర్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

