కలం, వెబ్ డెస్క్: ఏపీలో గతరాత్రి స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ, పాడేరు నియోజకవర్గంలలో భూ ప్రకంపనలు వచ్చాయి. సుమారు 8 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళననకు గురైన ప్రజలు.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతను ఒరిస్సా కోరాపుట్ ప్రాంతంలో భూకంప కేంద్రం వెల్లడించింది. రెక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.4 గా నమోదు అయినట్లు తెలిపింది. రాత్రి 11. 31 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

