కలం, వెబ్ డెస్క్: సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపునకు (లేఆఫ్స్) రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, వాల్ స్ట్రీట్ నుంచి వస్తున్న ఆర్థిక ఒత్తిళ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే వారం అధికారికంగా ప్రకటించనున్న ఈ లేఆఫ్స్ ద్వారా సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2.5 శాతం కంటే తక్కువ మందిని తొలగించనుందని తెలుస్తోంది. ప్రధానంగా సేల్స్, కన్సల్టింగ్, ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఖర్చులను నియంత్రిస్తూ, సాంకేతిక మార్పులకు అనుగుణంగా మైక్రోసాఫ్ట్ ఈ లేఆఫ్స్‌కు పాల్పడుతోందని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి.

