ఎరుపెక్కిన ఆకాశం.. మరో విలయానికి సంకేతమా?

కలం, వెబ్ డెస్క్ : వెనిజులాలో సంభవించిన భారీ భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. జూన్ 24 సాయంత్రం కేవలం ఒక నిమిషం వ్యవధిలో వరుసగా సంభవించిన భూకంపాల ధాటికి ఆ దేశం కుదేలైంది. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. అయితే, ఇప్పుడిప్పుడే  భూకంప సృష్టించిన వినాశనం నుంచి కోలుకుంటుండగా వెనిజులాలో ఆకాశం ఎర్రగా (Venezuela Red Sky) మారడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఈ సంకేతాలు మరో విలయానికి సంకేతమా? అని భయపడుతున్నారు. ఘోర భూకంపాల అనంతరం వెనిజులాలోని కారకస్ నగరంలో రక్తంతో తడిసిందా అనేలా ఆకాశం ఎర్రగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అధికారులు తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Read Also: ఎంతపొడవో..! భారత్‌పై 1,500 కి.మీ మేఘం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>