epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత్​లో 17.5 బిలియన్​ డాలర్ల పెట్టుబడి: సత్య నాదెళ్ల

కలం, వెబ్​డెస్క్​: భారత్​లో మైక్రోసాఫ్ట్​ 17.5 బిలియన్​ డాలర్ల పెట్టుబడి (Microsoft Invests) పెట్టనుంది. భారత్​లో ఏఐ విస్తరణ, అభివృద్ధికి ఈ నిధులు వాడతారు. ఈ మేరకు ప్రధానమంత్రి మోదీతో మంగళవారం జరిగిన భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్​ సీఈవో సత్యనాదెళ్ల(Satya Nadella) తన ‘ఎక్స్​’ ఖాతాలో ప్రకటించారు. ‘ భారత్​లో ఏఐ రంగంపై ప్రధానమంత్రి మోదీతో స్ఫూర్తిదాయక చర్చ జరిగింది. భారత్​ ఆశయాలకు, ఆకాంక్షలకు మద్దతుగా మైక్రోసాఫ్ట్​ రూ.17.5 బిలియన్​ డాలర్ల పెట్టుబడి పెడుతుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి. ఏఐ అభివృద్దికి కావల్సిన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, స్వావలంబన వంటి వాటికి ఈ పెట్టుబడి ఉపకరిస్తుంది’ అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని, పీఎంవో ‘ఎక్స్​’ ఖాతాలను ఆయన ట్యాగ్​ చేశారు.

కాగా, దేశంలో ఏఐ పరంగా డిజిటల్​ వర్క్​ఫోర్స్​ పెంచడానికి డేటా సెంటర్లు, క్లౌడ్​ సామర్థ్యం, స్కిల్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్స్​ అవసరం. అలాగే భారీస్థాయి కంప్యూటర్​ ఇన్​ఫ్రాస్టక్చర్​ కూడా కావాలి. ఏఐలో స్వావలంబన సాధించాలంటే దేశీయంగానే కంప్యూటర్​ వినియోగ సామర్థ్యం మెరుగుపర్చడం, స్థానిక అవసరాలకు అనుగుణంగా మోడళ్లు తయారుచేయడం, డేటాను దేశంలోనే నిల్వచేయడం ముఖ్యమని నిపుణులు ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు భారీ పెట్టుబడితో(Microsoft Invests) మైక్రోసాఫ్ట్​ ముందుకు రావడం దేశ ఏఐ రంగానికి అతిపెద్ద తోడ్పాటు దొరికిందని భావిస్తున్నారు.

Read Also: తెలంగాణ విజన్ అద్భుతం: ఆనంద్ మహీంద్రా

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>