కలం, వెబ్ డెస్క్: మైక్రోఫైనాన్స్ (Microfinance) కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా సింగర్ మంగ్లీతో (Singer Mangli) ముడిపడి ఉన్న మైక్రోఫైనాన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించారు. రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి శివ అకౌంట్‌కు మూడు సార్లు డబ్బులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే రమావత్ మధు బ్యాంకు ఖాతాలను పోలీసులు జప్తు చేశారు.
మైక్రోఫైనాన్స్ (Micro Finance) పథకాల పేరిట అధిక లాభాలు వస్తాయని మంగ్లీ, ఆమె సోదరుడు సహా మరికొంతమంది రూ. కోట్లలో మోసగించారంటూ బాధితులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిమకాంత్ రెడ్డి, ఇతర బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే సోదరుడి ఖాతాలోకి మైక్రోఫైనాన్స్ డబ్బులు జమ కావడంతో ఆయనతో పాటు మంగ్లీ (Singer Mangli) కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Read Also: ఇద్దరు యువకుల ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి..!
Follow Us On : WhatsApp

