కలం, వెబ్‌డెస్క్: ఏపీలో అర్నబ్ తుఫాన్ చేసిన నష్టాన్ని మరువక ముందే మురసు తుఫాన్ (Murasu Cyclone) ముంచుకొచ్చింది. ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల నిమిత్తం రూ.37 కోట్లు విడుదల చేసింది. ఇక ఈ జాబితాలో మొత్తం జిల్లాలు ఉన్నాయి. కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు ఒక్కో కోటి కేటాయించారు. నెల్లూరు, ప్రకాశం, మార్కపురం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఒక్కో జిల్లాలకు రూ.3 కోట్లు కేటాయించారు. నంద్యాల, చిత్తూరు, తిరుపతి, పల్నాడు, ఎన్టీఆర్, గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ. కోట్లు కేటాయించారు. తుఫాన్ బాధితులకు తప్పకుండా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సహాయక చర్యలు కొనసాగించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

