మురసు తుఫాన్‌ సన్నద్ధతపై సీఎం సమీక్ష

కలం, వెబ్ డెస్క్: మురసు తుఫాన్ (Murasu Cyclone) ఏపీ వైపు వేగంగా దూసుకొస్తుండటంతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష చేశారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు సహా 45 వేల మందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘అర్నబ్ తుఫాన్‌తో పోలిస్తే మురసు తుఫాన్ తీవ్రత తక్కువే అయినా ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి నుంచి రేపు రాత్రి 12 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. నాగార్జున సాగర్, పులిచింతల, బుడమేరు పరివాహక ప్రాంతాలకు భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. గంటగంటకు రియల్ టైంలో మానిటరింగ్ చేస్తుండాలి’ అని ఆదేశించారు.

ప్రాణ నష్టం జరగొద్దు..

మురసు తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ‘ఆస్తి నష్టం కూడా వీలైనంత మేరకు తగ్గించాలి. గుంటూరు, నెల్లూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇందుకోసం 5 వేల మంది సిబ్బందిని వెంటనే ఆయా ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేశాం. వీలైనంత త్వరగా విద్యుత్తును పునరుద్ధరించాలి. చెరువులు, కుంటలు వంటి చిన్ననీటి వనరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తుఫాన్ తీవ్రత తగ్గేవరకు క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి’ అని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>