తిలక్ వర్మ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ 200

కలం, వెబ్ డెస్క్ : ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ ( Tilak Varma) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. వర్మ మెరుపు సెంచరీతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డేనిష్ మలేవార్ (2), క్వింటన్ డి కాక్ (13) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. సూర్యకుమార్ యాదవ్ (15) కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును నమన్ ధీర్ (45), తిలక్ వర్మ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ధీర్ అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15) కూడా వర్మకు సహకారం అందించాడు. గుజరాత్ బౌలర్లలో కాగిసో రబాడ 3 వికెట్లతో రాణించాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. ముంబై బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>